తాడేపల్లి: ఆసియా పారా గేమ్స్‌లో 3 పతకాలు సాధించిన రవి కార్తీక్ బుడిగినను వైయస్ఆర్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. రవికార్తీక్ అద్భుతమైన ప్రతిభతో దేశానికి గర్వకారణంగా నిలిచాడు. పట్టుదల, కఠోర శ్రమ, పోరాట స్పూర్తితో యువతకు ఆదర్శంగా నిలిచాడని ప్రశంసించారు. రవి కార్తీక్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని రాష్ట్ర, దేశ కీర్తి ప్రతిష్టలను మరింత పెంచాలని ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రవికార్తీక్ జపాన్‌లో జరుగుతున్న పారాగేమ్స్‌లో స్విమ్మింగ్ విభాగంలో 2రజతాలు, ఒక కాంస్యం సాధించి సత్తా చాటారు.