సర్వేపల్లిలో వైయ‌స్ఆర్‌సీపీలోకి 50 మంది యువత

  నెల్లూరులో కాకాణి నివాసంలో పార్టీలో చేరిక

 కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

 నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీకి మద్దతుగా యువత ముందుకొస్తోంది. నెల్లూరులోని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నివాసంలో దక్షిణ ఆమలూరుకు చెందిన 50 మంది యువత టీడీపీని వీడి వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక నాయకుల సమష్టి కృషితో పలు కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరడం పార్టీకి మరింత బలాన్నిస్తోందని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి.

 మా తొలి ఓటు జగనన్నకే.. యువత స్పష్టీకరణ

తమ తొలి ఓటు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే వేస్తామని ముందుకొచ్చిన యువతను కాకాణి గోవర్ధన్‌రెడ్డి అభినందించారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా జగన్‌ నాయకత్వాన్ని బలపరచాలని యువత, స్థానిక నాయకులు నిర్ణయించుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం పనిచేసిన వారే ఇప్పుడు వైయ‌స్ఆర్‌సీపీలో చేరి జగన్‌ నాయకత్వానికి మద్దతు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుందని తెలిపారు.

 సర్వేపల్లిలో కొనసాగుతున్న చేరికలు

సర్వేపల్లి నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ రోజురోజుకూ బలపడుతోందని, టీడీపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయని కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక నాయకుల సమన్వయం, సమష్టి కృషితో యువతతో పాటు పలు కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరుతున్నాయని తెలిపారు. జగన్‌ నాయకత్వంపై విశ్వాసంతో పార్టీలోకి వస్తున్న వారందరికీ సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. 

Back to Top