అల్లూరి సీతారామరాజు జిల్లా: పీసీమామిడి గ్రామంలో జరిగిన పేలుడు ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు కార్మికులతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సునీత మృతి చెందడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కోసం వచ్చిన కార్మికులు, విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయురాలు ఇలా ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన శ్రీ వైయస్ జగన్, ఈ కష్ట సమయంలో వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపించాలని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన ఆర్థిక పరిహారం అందించి అన్ని విధాలుగా అండగా నిలవాలని కోరారు.