పలమనేరులో టీడీపీ దౌర్జన్యం

 కెలవాతిలో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి శ్రీనివాసులుపై దాడి

చిత్తూరు: పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి స్వగ్రామం కెలవాతిలో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి శ్రీనివాసులుపై టీడీపీ నేత సుబ్రమణ్యం దాడి చేసి గాయపరిచాడు. ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన శ్రీనివాసులుపై జరిగిన ఈ దాడితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

దాడి ఘటనపై శ్రీనివాసులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించకపోవడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి, దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. 

Back to Top