స్థానిక ఎన్నికల్లో వెన్నుపోటు పార్టీ రావణకాష్టం

వైయస్సార్‌సీపీ మహిళా అభ్యర్థులపైనా పైశాచికత్వం

బండి పుణ్యశీల ధ్వజం

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి పుణ్యశీల.

మహిళలపై టీడీపీ గూండాల పైశాచికత్వం

మహిళలన్న గౌరవం లేకుండా రాక్షస ప్రవర్తన

గర్భిణీలను సైతం వదిలిపెట్టకుండా దాడులు

బండి పుణ్యశీల ఫైర్‌

జగన్‌గారు ఆధారాలతో సహా అన్నీ బయటపెట్టారు

దీంతో తట్టుకోలేక వెన్నుపోటు పార్టీ అవాకులు, చెవాకులు

మాజీ సీఎం అన్న గౌరవం లేకుండా నీచపు మాటలు

నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోం

ప్రెస్‌మీట్‌లో బండి పుణ్యశీల వార్నింగ్‌

తాడేపల్లి: స్థానిక ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతో, ఎలాగైనా ప్రధాన విపక్షం బరిలో నిలవకూడదన్న ఉద్దేశంతో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం పలు చోట్ల విధ్వంసం సృష్టిస్తోందని వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి బండి పుణ్యశీల ఫైర్‌ అయ్యారు. అందులో భాగంగా, చివరకు వైయస్సార్‌సీపీ మహిళా అభ్యర్థులను సైతం వదలకుండా, దాడులు చేస్తూ పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. మహిళలన్న కనీసం గౌరవం కూడా లేకుండా, అత్యంత హేయంగా గర్భిణిపై దాడి చేయడంతో పాటు, మరో మహిళ పట్ల దుశ్వాసన పర్వం చేశారని ఆక్షేపించారు. 
    వెన్నుపోటు పార్టీ చేస్తున్న అరాచకాలను ఆధారాలతో సహా జగన్‌గారు బయట పెట్టడంతో, ఓర్చుకోలేక ఆయనపై అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. వెన్నుపోటు పార్టీ నాయకులు ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని తేల్చి చెప్పారు. లేకపోతే వారికి  తగిన గుణపాఠం చెబుతామని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బండి పుణ్యశీల వార్నింగ్‌ ఇచ్చారు.
ప్రెస్‌మీట్‌లో బండి పుణ్యశీల ఇంకా ఏం మాట్లాడారంటే..:

స్థానిక ఎన్నికల్లో వెన్నుపోటు పార్టీ రావణకాష్టం:
    రాష్ట్రంలో ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, విధ్వంసం చూస్తుంటే మనం అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా? అన్న సందేహం కలుగుతోంది. స్థానిక ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతో, పోటీలో ప్రధాన విపక్షం లేకుండా చేసి, ఎలాగైనా గెలవాలన్న దురుద్దేశంతో పలు రకాల కుట్రలు చేస్తున్నారు. మా పార్టీ నుంచి పోటీ చేస్తారన్న అభ్యర్థులను తొలుత బెదిరించారు. ఆ తర్వాత తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా, మా పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా దారుణంగా వ్యవహరించారు. వారిపై దాడి చేశారు. వారి చేతుల్లోని నామినేషన్‌ పత్రాలు లాక్కుని చింపేశారు. ఎక్కడైనా నామినేషన్‌ వేస్తే, చివరకు ఆర్‌ఓ చేతిలో నుంచి కూడా లాక్కుని చింపేశారు. ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే జరిగాయి. అయినా ఎక్కడైనా నామినేషన్లు ఉంటే, రకరకాల సాకులు చూపి, వాటిని స్క్రుటినీలో తీసేసే కుట్ర చేస్తున్నారు.

అడుగడుగునా మహిళలపై పైశాచికత్వం:
    అభ్యర్థుల నుంచి నామినేషన్‌ పత్రాలు లాక్కుంటున్నప్పుడు కనీసం మహిళలని కూడా చూడడం లేదు. వారి పట్ల అత్యంత హేయంగా ప్రవర్తించారు. నిండు గర్భిణీని సైతం విడిచిపెట్టలేదు. మరో అభ్యర్థిని చీర లాగేశారు.. అంటూ పలు ఘటనలు ఉదహరించారు.
    అనంతపురం జిల్లా ధర్మవరం మున్సిపాలిటీలో 32వ వార్డు కౌన్సిలర్‌ స్థానానికి నామినేషన్‌ వేయడానికి వెళుతున్న వైయస్సార్‌ సీపీ మహిళా అభ్యర్థిని, బోయ – వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన తలారి నళిపై టీడీపీ నేత శంకర్‌ దాడి చేసి చీర లాగాడు. చీర లాగేయడమేంటి, మీరేమైనా కీచకులా? చిత్తూరులో నామినేషన్‌ వేయడానికి వెళ్తున్న యువతిని అసభ్యంగా తాకుతూ, నామినేషన్‌ పత్రాలను లాక్కోవడానికి టీడీపీ మూకలు ప్రయత్నించాయి. శ్రీసత్యసాయి జిల్లాలో తాడిమర్రి మండల నాయకుడు తాడమర్రి చంద్రశేఖర్‌ రెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలోకి పోలీసులు చొరబడి 9 నెలల గర్భవతిని, ఇతర మహిళలను, వైయస్సార్‌ సీపీ కార్యకర్తలను దారుణంగా కొట్టారు. మాజీ మంత్రి విడదల రజినీ గారిని మూడు రోజుల పాటు ఇంట్లోనే బంధించి, అభ్యర్ధులకు నామినేషన్‌ పత్రాలు, బీఫామ్‌ లు కూడా ఇచ్చే పరిస్ధితి లేకుండా చేయడమే కాకుండా, ఓ మహిళా ఎస్సై దారుణంగా కిందకు తోసేశారు. చంద్రబాబు భజన చేయడంలో ముందుండే మహిళా హోంమంత్రి వంగలపూడి అనిత గారికి ఇవేవీ కనిపించడం లేదా?.
    కడపలో ఎమ్మెల్యే  మాధవీరెడ్డి.. ప్రెస్‌ మీట్లో తన మేయర్‌ అభ్యర్ధిని పక్కనబెట్టుకుని, ప్రత్యర్థుల్ని నామినేషన్‌ వేయనీయకండి, అడ్డుకోండని మాట్లాడుతోందంటే అసలు ఆమె ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధేనా, ఓ మహిళేనా అని అడుగుతున్నాం. 

జగన్‌గారిపై నోరెత్తితే ఊరుకునేది లేదు:
    గల్లా మాధవి వంటి ఎమ్మెల్యేలు జగన్‌గారి మేనకోడలు పెళ్లి గురించి తెగ బాధపడిపోతున్నారు. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే వాటి గురించి మాట్లాడటం మానేసి, నిస్సిగ్గుగా ఇలాంటి మాటలు మాట్లాడతారా? అసలు మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేలుగా, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన వ్యక్తులేనా అని అడుగుతున్నాం. చంద్రబాబు భజన చేసుకుంటే చాలు, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నారా?
    మాదిగ కార్పోరేషన్‌ ఛైర్‌ పర్సన్‌ ఉండవల్లి శ్రీదేవి వంటివారు రాష్ట్రమంతా ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగిపోతున్నాయని చెబుతుంటే జనం నవ్వుకుంటున్నారు. విజయవాడ నగరానికి చెందిన సెంట్రల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమ ఈసారి కూడా మంత్రి పదవి రాక దసరా టైంలో పూనకాలు వస్తున్నాయి. అందుకే ఆయన జగన్‌గారిపై అవాకులు చెవాకులు పేలుతున్నారు. స్థానిక ఎన్నికల్లో మీరు మా పార్టీ పేరుతో దాఖలు చేసిన ఫేక్‌ నామినేషన్లతో సహా, ప్రతి అంశాన్ని మా పార్టీ అధినేత, మాజీ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ చూపారు. దీంతో దిక్కు తోచక, వాటికి సమాధానం చెప్పలేక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. 
    ‘బొండా ఉమా, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే జగన్‌గారు చెప్పిన వివరాలు, చూపిన ఆధారాలకు సమాధానం చెప్పు. అంతే కానీ నోరు ఉంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోం. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకో. లేకపోతే మా పార్టీ మహిళలే నీకు తగిన బుద్ధి చెబుతారు’.. అని బండి పుణ్యశీల హెచ్చరించారు.

Back to Top