బీ‘పచ్చ’o.. హింసాత్మకం

 

ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల పర్వం ఆఖరి రోజూ రక్తసిక్తంగా మారింది. టీడీపీ గూండాలు చెలరేగిపోయారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా అడుగడుగునా అడ్డుతగిలారు. నామినేషన్‌ పత్రాలను లాక్కెళ్లి చించేశారు. వీరికి ‘పచ్చ’బొట్టేసుకున్న ఖాకీలు అండగా నిలిచారు. ప్రతిపక్ష అభ్యర్థులను ఎక్కడికక్కడ నిలువరించారు. ఇనుప కంచెలు వేసి మరీ అడ్డుకున్నారు. అభ్యర్థులు కాళ్లుమొక్కినా కరుణించలేదు. మాజీ ప్రజాప్రతినిధులపైనా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. గృహనిర్బంధాలు, నోటీసులతో బీభత్సం సృష్టించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. 

వైఎస్సార్‌ జిల్లా పోరుమామిళ్లలో నామినేషన్‌ వేయకుండా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకునేందుకు రోడ్డుకు అడ్డంగా నిలబడ్డ టీడీపీ వర్గీయులు


పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజినిని కిందకు తోసేస్తున్న ఎస్‌ఐ, ఎస్‌ఐ దురుసు ప్రవర్తనతో కిందపడిపోయిన విడదల రజిని 

మార్కాపురం జిల్లా పొదిలిలో నామినేషన్‌ వేయడానికి వచ్చిన వారిని  బలవంతంగా వెనక్కి పంపిస్తున్న పోలీసులు


వైఎస్సార్‌ కడప జిల్లా లింగాలలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులను ఇనుప ముళ్లకంచె పెట్టి అడ్డుకుంటున్న పోలీసులు 

వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిని నామినేషన్‌ వేయకుండా అడ్డుకుంటున్న టీడీపీ గూండాలు 

మార్కాపురం జిల్లా పీసీపల్లిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్‌ కేంద్రంలోకి వెళ్లనీయకుండా గేట్లు వేసి బారికేడ్లు పెట్టి అడ్డుకుంటున్న పోలీసులు 

అనంతపురం జిల్లా యల్లనూరులో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై రాళ్లు రువ్వుతున్న టీడీపీ మూకలు 

చిత్తూరు జిల్లా పెద్దపంజాణిలో వైఎస్సార్‌సీపీ నేతపై టీడీపీ మూకల దాడి 

                                  మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హౌస్‌ అరెస్టు 

కందుకూరులో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మధుసూదన్‌ యాదవ్‌ను గృహనిర్బంధం చేసిన పోలీసులు 

మార్కాపురం జిల్లా కనిగిరిలో గృహనిర్బంధంలో వైఎస్సార్‌సీపీ  ఇన్‌చార్జ్‌ దద్దాల నారాయణ యాదవ్‌

మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ హౌస్‌ అరెస్ట్‌


తిరుపతి జిల్లా నాయుడుపేటలో మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య, మార్కాపురంలో మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డిలకు హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నట్లు నోటీసు ఇస్తున్న పోలీసులు

ప్రకాశం జిల్లా లింగసముద్రంలో నామినేషన్‌లకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై రాళ్లతో దాడి చేస్తున్న టీడీపీ గూండాలు , మార్కాపురం జిల్లా కొనకనమిట్లలో నామినేషaన్‌ వేయించాలని ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా కాళ్లు పట్టుకున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని బాలగురవమ్మ    

వైఎస్సార్‌ జిల్లా వేంపల్లెలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులను అడ్డుకుంటున్న పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌ 

అనంతపురం జిల్లా యల్లనూరులో టీడీపీ శ్రేణుల రాళ్ల దాడిలో గాయపడిన ఓబులేసు , శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త 

Back to Top