రీకౌంటింగ్‌ వివాదం.. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అరెస్ట్‌!

నాయుడుపేట 2వ వార్డు ఫలితంపై ఉద్రిక్తత

నాయుడుపేట: తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలోని 2వ వార్డు ఎన్నికల ఫలితంపై వివాదం చోటుచేసుకుంది. తొలుత ఓట్ల లెక్కింపులో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటించగా, టీడీపీ అభ్యర్థి రీకౌంటింగ్‌ కోరడంతో మరోసారి లెక్కింపు చేపట్టారు. అనంతరం టీడీపీ అభ్యర్థి ఆరు ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు అధికారులు ప్రకటించడంతో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

ఫలితంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మరోసారి రీకౌంటింగ్‌ నిర్వహించాలని కోరుతూ కౌంటింగ్‌ కేంద్రం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరెస్ట్‌ చేశారు. ఈ పరిణామంతో నాయుడుపేట 2వ వార్డు వద్ద ఉద్రిక్తత నెలకొంది.

Back to Top