నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అర్ధరాత్రి స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్కడ ఉన్న ఖాళీ బ్యాలెట్ బాక్సులను పరిశీలించిన వైయస్ఆర్‌సీపీ నేతలు, వాటిలో ఓట్లు ఉండటాన్ని గుర్తించి ఎన్నికల కమిషనర్‌ను నిలదీశారు. ఖాళీగా ఉండాల్సిన బాక్సుల్లో ఓట్లు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తూ, దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోరారు. అయితే వైయస్ఆర్‌సీపీ నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన కమిషనర్.. ఖాళీ బ్యాలెట్ బాక్సుల వ్యవహారంపై వివరణ ఇచ్చే అవసరం తనకు లేదన్నట్లు వ్యవహరించడంతో అక్కడ గందరగోళం నెలకొంది. ఈ వ్యవహారంపై ఎన్నికల అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.