రేపు బెంగళూరులో శ్రీ వైయస్‌ జగన్‌ పర్యటన

 రాప్తాడులో దాడికి గురై తీవ్రంగా గాయపడిన విద్యార్థిని గోపికను పరామర్శించనున్న మాజీ ముఖ్యమంత్రి

బెంగళూరు మణిపాల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోపికను పరామర్శించనున్న శ్రీ వైయస్‌ జగన్‌

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ రేపు (02.11.2026) బెంగళూరులో పర్యటించనున్నారు.

అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఇటీవల జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి, బెంగళూరులోని మణిపాల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పదో తరగతి విద్యార్థిని గోపికను శ్రీ వైయస్‌ జగన్‌ పరామర్శించనున్నారు.

మధ్యాహ్నం 2.15 గంటలకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోపిక ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య సేవల వివరాలను తెలుసుకోనున్నారు. అలాగే విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు.

Back to Top