ఇవాళ‌ బెంగళూరులో వైయస్‌ జగన్‌ పర్యటన

తీవ్రంగా గాయపడిన విద్యార్థిని గోపికను ప‌రామ‌ర్శించ‌నున్న మాజీ సీఎం 

తాడేపల్లి : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ ఈ రోజు బెంగళూరులో పర్యటించనున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఇటీవల జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి, బెంగళూరులోని మణిపాల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పదో తరగతి విద్యార్థిని గోపికను ఆయన పరామర్శించనున్నారు.

మధ్యాహ్నం 2.15 గంటలకు ఆసుపత్రికి చేరుకుని గోపిక ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య సేవలను తెలుసుకోనున్నారు. అనంతరం విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పనున్నారు.

Back to Top