జీవీఎంసీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల విజయపరంపర!

విశాఖలో పలు వార్డులను కైవసం చేసుకున్న వైయ‌స్ఆర్‌సీపీ

విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులు పలు వార్డుల్లో విజయం సాధించారు. 104వ వార్డులో మద్ది శ్రీను, 61వ వార్డులో మెట్ట దమయంతి, 119వ వార్డులో దాసరి అన్నపూర్ణ, 19వ వార్డులో మోల్లి లక్ష్మి, 84వ వార్డులో గుడివాడ వెంకట సాయి అనూష, 94వ వార్డులో ధర్మాల రాధిక, 99వ వార్డులో కోమటి శ్రీనివాసరావు గెలుపొందారు.

అలాగే 6వ వార్డులో పోతున హనుమంతరావు, 7వ వార్డులో పోతున జాహ్నవి, 59వ వార్డులో అల్లు వెంకట సత్యశ్రీ, 42వ వార్డులో కోడిగుడ్ల పూర్ణిమ, 65వ వార్డులో షేక్‌ జన్నీరుష విజయం సాధించారు. వరుస విజయాలతో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Back to Top