కోనసీమ జిల్లా: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం నగర పంచాయతీ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు మూడు వార్డుల్లో విజయం సాధించారు. మొత్తం 23 వార్డులకు గాను ఇప్పటివరకు 18 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. 17వ వార్డులో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి పొనుగుమట్ల వెంకట సూర్యనారాయణ కేవలం 7 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 23వ వార్డులో కడలి పార్వతి 130 ఓట్ల మెజారిటీతో, 19వ వార్డులో రామాయణం శ్రీరామచంద్రమూర్తి 102 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మిగిలిన వార్డుల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.