నందికొట్కూరు మున్సిపల్‌ చైర్మన్‌ పీఠం వైయ‌స్ఆర్‌సీపీ కైవసం!

చైర్మన్‌ అభ్యర్థి షేక్‌ ఫాతిమాబీకి 2,634 ఓట్లతో ఘన విజయం

నంద్యాల: నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు మున్సిపాలిటీలో వైయ‌స్ఆర్‌సీపీ ఘన విజయం సాధించింది. మున్సిపల్‌ చైర్మన్‌ పీఠాన్ని కైవసం చేసుకుంది. చైర్మన్‌ అభ్యర్థి షేక్‌ ఫాతిమాబీ 2,634 ఓట్లతో విజయం సాధించారు. మొత్తం 32 వార్డులకు గాను 23కి పైగా వార్డుల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు గెలుపొందడంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి.

ఎన్నికల ప్రచారం ప్రారంభం నుంచి బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ ముందుండి నడిపించారు. కేడర్‌తో నిరంతర సమన్వయం, ప్రచారంలో అనుసరించిన వ్యూహం విజయానికి దోహదపడిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. చైర్మన్‌ పీఠం దక్కించుకోవడంతో నందికొట్కూరులో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Back to Top