మడకశిర: నియోజకవర్గంలో వర్షపాతం లేకపోవడంతో పశువులకు గడ్డి, దాణా కొరత తీవ్రంగా ఏర్పడిందని మడకశిర నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త ఎస్.ఎల్. ఈరలక్కప్ప తెలిపారు. ఈ మేరకు మడకశిర పట్టణంలో ఆర్డీఓ రమాదేవిని కలిసి వినతిపత్రం అందించారు. వర్షాలు లేక మేత అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి పశువులకు అవసరమైన గడ్డి, దాణాను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. దాణా కొరత కారణంగా రైతులు తమ పశువులను కబేళాలకు తరలించే పరిస్థితి ఏర్పడకుండా తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే తగిన ఏర్పాట్లు చేయాలని ఈరలక్కప్ప కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు శ్రీరాములు, ఓం కుమార్, రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి నాగభూషణ్ రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు నరసింహమూర్తి, తాలూకా బూత్ కన్వీనర్ మల్లికార్జున్ గౌడ్, తాలూకా పబ్లిక్ వింగ్ సికిందర్, పట్టణ ఉపాధ్యక్షులు గోపి, పట్టణ బూత్ కన్వీనర్ రవీంద్ర, పట్టణ పబ్లిక్ వింగ్ రఘు, పట్టణ నాయకులు సీనా తదితరులు పాల్గొన్నారు.