కర్నూలు: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కర్నూలులో పర్యటించారు. కర్నూలులోని సెయింట్ జోసెఫ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగిన మాజీ ఎమ్మెల్యే ఎస్.వి. మోహన్‌రెడ్డి కుమారుడు జనక్ వివాహ రిసెప్షన్‌కు వైయస్ జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు శ్రియ–జనక్‌లను ఆశీర్వదించి, వారికి హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. వధువు శ్రియ రాజమండ్రి రుడా మాజీ ఛైర్మన్ షర్మిల, మేడపాటి అనిల్‌రెడ్డి దంపతుల కుమార్తె. నూతన దంపతులు సుఖసంతోషాలతో, ఆనందమయమైన దాంపత్య జీవితాన్ని గడపాలని వైయస్ జగన్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైయస్ఆర్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.