ఇస్రో శాస్త్రవేత్తలకు వైయ‌స్‌ జగన్‌ అభినందనలు

తాడేపల్లి: జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం విజయవంతం కావడంపై వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనతను సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు అభినందనలు తెలిపారు.

ఈ మిషన్‌ ద్వారా వాతావరణ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణను మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనల్లో భారత శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు సాధిస్తున్న విజయాలు దేశ ప్రజలందరికీ గర్వకారణంగా నిలుస్తున్నాయని వైయ‌స్‌ జగన్ త‌న ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
 

Back to Top