జోహన్నెస్‌బర్గ్: మహానేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని వైయస్ఆర్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ సౌత్ ఆఫ్రికా ఆధ్వర్యంలో జోహన్నెస్‌బర్గ్‌లో సేవా కార్యక్రమం నిర్వహించారు. వైయస్ఆర్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ సౌత్ ఆఫ్రికా కన్వీనర్ విక్రమ్ రెడ్డి పెట్లూరు ఆధ్వర్యంలో ఈడెన్వేల్‌లోని ది లిటిల్ ఈడెన్‌లో ప్రత్యేక అవసరాలు కలిగిన వారి సంక్షేమం, సహాయార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవా భావం, మానవత్వం, సమాజం పట్ల బాధ్యతను చాటుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి అండగా నిలిచేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. వైయస్‌ఆర్ వర్ధంతిని సేవా కార్యక్రమంతో నిర్వహించడం ద్వారా మహానేత ఆశయాలను స్మరించుకున్నారు. వైయస్‌ఆర్ ఆశయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల్లో విస్తృతంగా చాటిచెప్పడంతో పాటు, ఆయన సేవా స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు ఇటువంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని వైయస్ఆర్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ సౌత్ ఆఫ్రికా ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించి, పాల్గొని విజయవంతం చేసిన నరసింహరెడ్డి కల్లా, సూర్య రామిరెడ్డి, మురళి సోమిశెట్టి, శివ రాజవరపు, బసిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, వీరయ్య కట్టెపోగు, ఆంజనేయులు బిక్కా, మోహన్ పోలుబోయిన, అంజలి అవనిగడ్డ, మధుసూదన్ రెడ్డి పల్లె, అంజిరెడ్డి, వెంకట్ రెడ్డి ఏనుముల, హరీష్ గోరంట్ల, శ్రావణి పెట్లూరు, కరుణ బసిరెడ్డి, సుమన్ చిట్లకికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.