సాగునీటి కోసం రైతుల గోడు తెలుసుకుంటూ.. పాదయాత్ర

రేపల్లె నియోజకవర్గంలో ప‌ర్య‌టిస్తున్న‌ పీటా నాగమోహన్‌ కృష్ణ 

బాపట్ల: రేపల్లె నియోజకవర్గంలోని చివరి భూములకు సాగునీరు అందక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్‌సీపీ రేపల్లె నియోజకవర్గ నేత పీటా నాగమోహన్‌ కృష్ణ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఎండిపోతున్న నారుమళ్లను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. 
సాగునీరు అందక ఇప్పటికే వరి పంటపై సుమారు రూ.25 వేల వరకు ఖర్చు చేసి రైతులు తీవ్రంగా నష్టపోయారని నాగమోహన్‌ కృష్ణ తెలిపారు. రేపల్లె నియోజకవర్గంలోని నాలుగు మండలాలను వెంటనే కరువు మండలాలుగా ప్రకటించి, నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

రైతుల సమస్యలను తెలుసుకునేందుకు చేపట్టిన పాదయాత్రలో కార్యకర్తలు సౌండ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, పీటా నాగమోహన్‌ కృష్ణకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రైతుల సమస్యలపై పాదయాత్ర చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన పోలీసులను ప్రశ్నించారు. 
సాగునీరు అందక నష్టపోయిన రైతులకు తక్షణ సాయం అందించడంతో పాటు బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలను వెంటనే మాఫీ చేయాలని పీటా నాగమోహన్‌ కృష్ణ డిమాండ్‌ చేశారు.
 

Back to Top