తాడేపల్లి: శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ధర్మాన్ని నిలబెట్టి, సత్యానిదే అంతిమ విజయమని జగతికి చాటిన శ్రీకృష్ణ భగవానుడి కృపాకటాక్షాలతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. శ్రీకృష్ణుడి బోధనలు ధర్మం, సత్యం, న్యాయం వైపు సమాజాన్ని నడిపించే మార్గదర్శకాలని పేర్కొంటూ.. ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.