రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు

శ్రీకృష్ణుడి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపైనా ఉండాలని ఆకాంక్షించిన వైయ‌స్‌ జగన్‌

తాడేపల్లి: భగవాన్‌ శ్రీకృష్ణుడి జన్మదినం కృష్ణాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మానవాళికి కర్తవ్య బోధ చేసిన భగవద్గీతను ప్రసాదించి, మంచికి ప్రతీకగా నిలిచి చెడుపై విజయం సాధించిన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని ప్రజలంతా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు రాష్ట్రంపైనా, ప్రజలందరిపైనా ఎల్లవేళలా ఉండాలని వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన శుభాకాంక్షల సందేశంలో అభిలషించారు.
 

Back to Top