కోడుమూరు నియోజకవర్గంలో ఘనంగా వైయ‌స్‌ఆర్‌ 17వ వర్ధంతి

పేదలకు కంటి వైద్య పరీక్షలు.. అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్లు

కోడుమూరు: దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా కోడుమూరు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో వైయ‌స్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. కుడా మాజీ చైర్మన్‌, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యుడు, నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి ఆదేశాల మేరకు కార్యక్రమాలు నిర్వహించారు.

కోడుమూరు మండల కేంద్రంలో నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ ఆదిమూలపు సతీష్‌, జెడ్పీటీసీ రఘునాథరెడ్డి, రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి తదితరులు వైయ‌స్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాల్లో భాగంగా పేదలకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు చేయించారు. చికిత్స కోసం వాహన సౌకర్యం కల్పించి, అనంతరం వారిని స్వగ్రామాలకు చేర్చారు.

కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల నేతలు, కార్యకర్తలు, వైయ‌స్‌ఆర్‌ అభిమానులు పాల్గొన్నారు. వైయ‌స్‌ఆర్‌ చూపిన సేవా మార్గంలో ప్రజలకు అండగా నిలవడమే నిజమైన నివాళి అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
 

Back to Top