వైయ‌స్ఆర్ స్మృతివ‌నంలో మహానేతకు ఘన నివాళులు

న‌ల్ల‌కాల్వ‌: దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా నంద్యాల జిల్లా న‌ల్ల‌కాల్వ స‌మీపంలోని వైయ‌స్ఆర్ స్మృతివ‌నం(పావురాల గుట్ట)లో వైయ‌స్‌ఆర్‌సీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. వైయ‌స్‌ఆర్‌సీపీ రాష్ట్ర యువజన ఎంపవర్‌మెంట్‌ సెల్‌ కన్వీనర్‌ షేక్‌ సలామ్‌బాబు, ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొసిమ్‌ రెడ్డి సునీల్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరీష్‌రెడ్డి కలిసి మహానేత వైయ‌స్‌ఆర్‌కు నివాళులర్పించారు.  ఈ సందర్భంగా షేక్‌ సలామ్‌బాబు మాట్లాడుతూ వైయ‌స్‌ఆర్‌ ఆశయాలు, ప్రజా సంక్షేమ పాలనను ముందుకు తీసుకెళ్లే అవకాశం వైయ‌స్‌ జగన్‌ నాయకత్వంతోనే సాధ్యమవుతోందని పేర్కొన్నారు. పేదలు, రైతులు, బలహీన వర్గాల సంక్షేమానికి వైయ‌స్‌ఆర్‌ చూపిన మార్గంలోనే ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

పొసిమ్‌ రెడ్డి సునీల్‌రెడ్డి మాట్లాడుతూ వైయ‌స్‌ఆర్‌ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, వాటిని వేగంగా పూర్తి చేయడంతో ఆయన జలప్రదాతగా ప్రజల మన్ననలు పొందారని గుర్తుచేశారు. మహానేత సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
 

Back to Top