నాన్నే నా స్ఫూర్తి

వైయ‌స్‌ఆర్‌ను తలచుకుంటూ.. వైయ‌స్‌ జగన్‌ భావోద్వేగ సందేశం

తాడేపల్లి: మహానేత డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన తండ్రిని స్మరించుకుంటూ భావోద్వేగ సందేశాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. “మిస్‌ యూ ఆల్వేస్‌, డాడ్‌! యూ విల్‌ ఫరెవర్‌ బీ మై ఇన్‌స్పిరేషన్‌” అంటూ తండ్రిపై తనకున్న ఆప్యాయతను వ్యక్తం చేశారు.

వైయ‌స్‌ఆర్‌ తనకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని వైయ‌స్‌ జగన్‌ పేర్కొన్నారు. తండ్రితో తనకున్న అనుబంధాన్ని, ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అంతకుముందు ఇడుపులపాయలోని వైయ‌స్‌ఆర్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులు, పార్టీ కేడర్‌తో కలిసి మహానేతకు నివాళులర్పించారు.
 

Back to Top