విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నీటి కోసం రోడ్డెక్కిన మ‌హిళ‌లు 

“చంద్రబాబు నీళ్లు ఇవ్వాలి” అంటూ బిందెలతో నిరసన

 
విశాఖ: ఉత్తర నియోజకవర్గంలో తాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న తమ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. “చంద్రబాబు నీళ్లు ఇవ్వాలి” అంటూ నినాదాలు చేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని నిరసనకారులు కోరారు. నీటి సరఫరాను పునరుద్ధరించి ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ నిరసన కార్యక్రమానికి వైయ‌స్ఆర్‌సీపీ స్థానిక మాజీ కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి మద్దతు తెలిపారు. వైయ‌స్ఆర్‌సీపీ ఐటీ వింగ్ సభ్యులు లావణ్య రెడ్డి, కుసుమ కూడా ప్రజలతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. మహిళల సమస్యలను అడిగి తెలుసుకుని, తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రజల తరఫున నిలబడతామని తెలిపారు.
 

Back to Top