తాడేపల్లి:డీఎస్సీ అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి.., తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలవలేదని తేలిన తర్వాత, ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి.., వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం లిక్కర్ కేసు పేరుతో కొత్త డ్రామాలకు తెరలేపుతూ కుట్ర చేస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాతూ రాష్ట్ర రైతాంగం కరువు కోరల్లో చిక్కుకుని అల్లాడుతుంటే, ముందుచూపు లేని పాలకులు రాష్ట్రాన్ని దోచుకునే పనిలో ఉన్నారని ధ్వజమెత్తారు. శ్రీపాద వల్లభుడి సాక్షిగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దీంతో ప్రజల నుంచి వస్తున్న తీవ్రమైన వ్యతిరేకత నుంచి తప్పుదారి పట్టించడానికి ఇంకా ప్రభుత్వం అవినీతిలో దొరికినప్పుడల్లా లిక్కర్ కేసు పేరుతో వైసీపీ వారిని ముద్దాయిలుగా తెరపైకి తీసుకురావడం రెండేళ్లుగా సాగుతున్న సీరియల్ నాటకమని గుర్తు చేశారు. సిట్ దర్యాప్తు పేరుతో జరుగుతున్న ఈ తంతు అంతా పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. పదేళ్లుగా మానసిక రోగంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న సత్యప్రసాద్ అనే ఎక్సైజ్ ఉద్యోగి చెప్పిన మాటలకు ఆధారాలు ఏమిటని పేర్ని నాని ప్రశ్నించారు. జగన్ గారికి డబ్బులు చేరాయని ఆయన చెబితే వెంటనే నమ్మేస్తారా? ఆయన చెప్పిన దానికి ఆధారాలు ఏమిటి? ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇతర ఎల్లో మీడియా సత్యప్రసాద్‌ను ఎక్సైజ్ శాఖలో దిగువస్థాయి ఉద్యొగిగా నుండి అకస్మాత్తుగా హరిశ్చంద్రుడిని చేసి రాస్తున్న కట్టుకథలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేష్‌ల కబ్జా పాలనపై ప్రజలందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పేర్ని నాని హెచ్చరించారు. ప్రెస్ మీట్ లో పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే... లిక్కర్ కేసుతో రెండేళ్లుగా కట్టుకథలు: డీఎస్సీ అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆ వ్యవహారాన్ని కప్పిపుచ్చడానికి లిక్కర్ కేసును తెరపైకి తీసుకురావడం రెండేళ్లుగా జరుగుతున్న సీరియల్ నాటకం. కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడి దొరికిన ప్రతిసారీ, ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన ప్రతిసారీ వైయస్ఆర్‌సీపీలో ఎవరో ఒకరిని ముద్దాయిగా తెరపైకి తీసుకురావడం పరిపాటిగా మారింది. డీఎస్సీ అంశాన్ని కప్పిపుచ్చడానికి చేసే ప్రయత్నం గంగానది నీళ్లు తెచ్చి కడిగినా పోదు. రాష్ట్ర రైతాంగాన్ని కరువు రక్కసి కోరల్లో ఒడిసి పట్టుకున్నా ముందుచూపుతో కార్యాచరణ చేయకుండా దోచుకునే పనుల్లో ప్రభుత్వం నిమగ్నమై ఉంది. ఈ వైఫల్యాలన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కొత్త కొత్త కథలు చెబుతున్నారు. లిక్కర్ స్కాంపై ఎన్నిసార్లు మాట మారుస్తారు?: ఎన్నికల ప్రచారంలో లిక్కర్ స్కామ్ విలువ లక్ష కోట్లు అని విషం చిమ్మారు. ఓట్లు లెక్కింపు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ 44 వేల కోట్లని, చంద్రబాబు 33 వేల కోట్లని ఆరోపణలు చేశారు. తెల్ల కాగితం పేరుతో రూ. 18 కోట్లు అన్నారు, చివరికి చంద్రబాబు సిట్ కోర్టులో 3వేల కోట్లు అంటుంది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉంది వీళ్ల పరిస్థితి. ఈ లిక్కర్ కేసులో ఇప్పటివరకు కనీసం 3 రూపాయలు కూడా ఎక్కడా పట్టుకోలేదు, రికవరీ చేయలేదు. సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టినా, హైకోర్టు జడ్జీలను సైతం లెక్కచేయకుండా కోర్టులను ఏమార్చే పనులు చేస్తున్నారు. దర్యాప్తును సాగదీస్తూ పిట్టకథలు, కట్టుకథలు, మొగలిరేకుల మలుపులతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. కోర్టుల్లో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియదనుకుంటున్నారా? హైకోర్టు జడ్జిలను కూడా లెక్కచేయని ధోరణితో వ్యవహరిస్తే ప్రజాస్వామ్యంలో వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుంది? దర్యాప్తు నిజాల కోసం జరగాలి కానీ రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి జరగకూడదు. మానసిక రోగి సత్యప్రసాద్ వాంగ్మూలాన్ని ఎలా నమ్మాలి?: సత్యప్రసాద్ ఎక్సైజ్ శాఖలో దిగువస్థాయి ఉద్యోగి. సత్యప్రసాద్‌ను ఏ 3 గా చేర్చినప్పటికీ ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? పైగా ఆ వ్యక్తికి మానసిక సమస్యలు ఉన్నాయని, గత పదేళ్లుగా అనంతపురంలో డాక్టర్ వద్ద ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని మెడికల్ సర్టిఫికెట్లు ఉన్నాయి. మానసిక రోగంతో బాధపడుతున్న ఒక వ్యక్తి చెప్పిన మాటలను, వాంగ్మూలాన్ని సిట్ ఎలా పరిగణనలోకి తీసుకుంటుంది? మెంటల్ సర్టిఫికెట్ ఉన్న వ్యక్తితో చెప్పించినంత మాత్రాన జగన్ గారిపై చేస్తున్న దుష్ప్రచారాన్ని చూసి ఎవరూ బెదరరు. జగన్ గారికి డబ్బులు చేరాయని ఆయన చెబితే వెంటనే నమ్మేస్తారా? ఆయన చెప్పిన దానికి ఆధారాలు ఏమిటి? సత్యప్రసాద్ ఏనాడైనా జగన్ గారిని కలిశారా? మాట్లాడారా? డబ్బులు ఇచ్చినట్లు ప్రత్యక్ష ఆధారాలు ఉన్నాయా? అన్నీ ‘అట’, ‘అట’ అంటూ చెప్పడం సాక్ష్యాలుగా మారిపోతుందా? ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఆ ‘అట’ మాటలనే ఆధారాలుగా ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారని అనుకోవడం పొరపాటు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా సత్యప్రసాద్‌ను ఎక్సైజ్ శాఖలో దిగువస్థాయి ఉద్యొగిగా నుండి అకస్మాత్తుగా హరిశ్చంద్రుడిని చేసి రాస్తున్న కట్టుకథలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. డైవర్షన్‌తో డీఎస్సీ అక్రమాలను కప్పిపుచ్చలేరు: డీఎస్సీలో రెగ్యులర్ కోటాలోనే అక్రమాలు జరిగాయని ఆధారాలు సహా ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లతో టీచర్ ఉద్యోగాలు పొందిన అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. బీసీ-డీ అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సర్టిఫికెట్లు ఎలా వచ్చాయి? కోరుకొండ నగేష్‌కు ఉద్యోగం ఎలా వచ్చింది? మామిడి నగేష్‌కు ఉద్యోగం ఎలా వచ్చింది? వీటికి సంబంధించిన ఆధారాలను ప్రభుత్వం పరిశీలించాలి. నకిలీ సర్టిఫికెట్లు ఉంటే వాటిని ఎవరు జారీ చేశారు? ఎంఆర్‌ఓలు, డీఈఓల పాత్ర ఏమిటి? అధికారుల సంతకాలు ఎలా వచ్చాయి? ప్రతి అంశంపై విచారణ జరగాలి. రాష్ట్రంలో డీఎస్సీపై ఆందోళనలు, ప్రశ్నలు కొనసాగుతున్నాయి; వైయస్ఆర్‌సీపీ కూడా నియామక ప్రక్రియపై సీబీఐ విచారణ కోరుతూ ఆందోళనలు చేపట్టింది. ఈ దగా డీఎస్సీ మోసాలను కప్పిపుచ్చడానికి ఎంత ప్రయత్నించినా వృథా ప్రయాసే. గంగానది నీళ్లతో కడిగినా ఆ పాపాలు పోవు. అర్హులైన నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. విజయవాడ సీపీ వ్యవహార శైలి పోలీస్ వ్యవస్థకే కళంకం: సాయికృష్ణ లాకప్ డెత్ విషయంలో విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు వ్యవహార శైలి పోలీసు వ్యవస్థకే కళంకం తెచ్చింది. నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నా నిందితులను అరెస్ట్ చేయకుండా కాపాడుతున్నారు. కాదంబరి జత్వాని కేనును తమ రాజకీయ లబ్ధి కోసం, సిమెంట్ కంపెనీల బేరాల కోసం ఏవిధంగా వాడుకున్నారో చూశాం. చంద్రబాబు, లోకేష్‌లు ప్రజల ఆస్తులను, పొలాలను చెరబట్టే పనుల్లో బిజీగా ఉన్నారు. చంద్రబాబు కేవలం ఒక కీలుబొమ్మ సర్కారును నడిపిస్తున్నారు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్న లిక్కర్ వ్యాపారంపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. క్యాష్, సూట్‌కేసు, రాజేష్, సతీష్, లోకేష్ పేర్లతో జరుగుతున్న వ్యవహారాలపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. దొంగ డిస్టిలరీలు, మద్యం దందా జరుగుతున్నాయన్న ఆరోపణలపై ప్రభుత్వం ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు? మద్యం వ్యాపారంలో ఎవరి ప్రయోజనాలు కాపాడుతున్నారు? కాదంబరి జత్వానీ కేసు ఎవరి ప్రయోజనం కోసం వాడుకున్నారు?: కాదంబరి జత్వానీ వ్యవహారాన్ని ఎవరి ప్రయోజనాల కోసం ఉపయోగించారు? సిమెంట్ కంపెనీతో బేరం ఏమిటి? చంద్రబాబు సన్నిహితుడైన ఐపీఎస్ అధికారి పాత్ర ఏమిటి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? చంద్రబాబు, లోకేష్ ప్రజల ఆస్తులను చెరబట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలకు సమాధానం చెప్పాలి. ప్రజల ఆస్తులు, భూములు, ప్రభుత్వ ఆస్తుల విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తి పారదర్శకత ఉండాలి. అధికారాన్ని ఉపయోగించి వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలకు వ్యవస్థలను వాడుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. సూపర్ సిక్స్ హామీలు ఎక్కడ?: శ్రీపాద వల్లభుడి సాక్షిగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దేవుళ్ల సాక్షిగా సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆ హామీల పరిస్థితి ఏమిటి? రైతులకు ఏం చేశారు? యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పరిస్థితి ఏమిటి? మహిళలకు ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటి? రాష్ట్ర రైతాంగం కరువు రక్కసి కోరల్లో చిక్కుకుంటే ముందస్తు కార్యాచరణ ఎక్కడ? కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి? ప్రజలకు చెప్పాల్సిన ఈ అంశాలను పక్కనపెట్టి రాజకీయ కేసులు, వ్యక్తిగత ఆరోపణలు, మీడియా కథనాలతో కాలం వెళ్లదీస్తున్నారు. ప్రజల తిరుగుబాటును ఏమార్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాదు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత: కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్య ప్రజలు తమ సమస్యలపై ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రతిపక్ష నాయకులపై కేసులు, విచారణలు, ఆరోపణలతో ప్రజల దృష్టిని మళ్లించాలనుకోవడం తాత్కాలికంగా మాత్రమే సాధ్యమవుతుంది. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అమలు చేసిన పథకాలు, ప్రజలకు జరిగిన ప్రయోజనం అన్నింటినీ ప్రజలే లెక్క వేసుకుంటున్నారు. ఎన్ని రాజకీయ డ్రామాలు చేసినా అసలు సమస్యలను దాచలేరని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.