డీఎస్సీ స్కామ్‌–2025పై ఆందోళనకు ఎస్సీ సెల్‌ సన్నద్ధత

తాడేప‌ల్లి: విజయవాడలోని శాప్‌ కార్యాలయం వద్ద ఈ నెల 21ప వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టనున్న డీఎస్సీ స్కామ్‌–2025 అంశంపై ఆందోళన కార్యక్రమానికి ఎస్సీ సెల్ సిద్ధ‌మ‌వుతోంది. ఇవాళ తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు టీజేఆర్ సుధాక‌ర్‌బాబు అధ్య‌క్ష‌త‌న‌ విస్తృత భాగస్వామ్యంపై చర్చ జరిగింది. జోన్‌–3 పరిధిలోని ఐదు జిల్లాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసి కార్యక్రమంలో పాల్గొనేలా కార్యాచరణ రూపొందించడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఐదు జిల్లాల ఎస్సీ సెల్‌ నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యాన్ని పెంచడం, అవసరమైన సమన్వయం చేయడం, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు పరస్పర సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని సుధాక‌ర్‌బాబు పిలుపునిచ్చారు. 

Back to Top