27న రాజ‌మండ్రిలో బీసీ గర్జన 

స‌భ విజయవంతానికి భీమవరం నియోజకవర్గ బీసీ నాయకుల సమావేశం

భీమవరం: ఈ నెల 27వ తేదీన రాజమండ్రి వెంకటాద్రి గార్డెన్స్‌లో నిర్వహించనున్న “వెన్నుపోటు–వంచనపై బీసీ గర్జన” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ భీమవరం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో బీసీ నాయకుల సమావేశం నిర్వహించారు. శాసన మండలి సభ్యులు, రాష్ట్ర శెట్టిబలిజ విభాగ అధ్యక్షులు కవురు శ్రీనివాస్, భీమవరం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి చినిమిల్లి వెంకటరాయుడు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో బీసీ గర్జన కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా సమన్వయం చేసుకోవాలని చర్చించారు.

ఈ సందర్భంగా బీసీ నాయకులతో సమావేశమైన నాయకులు రాజమండ్రిలో జరిగే బీసీ గర్జనను విజయవంతం చేసేందుకు నియోజకవర్గ స్థాయిలో విస్తృతంగా కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని కోరారు. బీసీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో బీసీ నాయకులు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Back to Top