తాడేపల్లి: పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్త కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలవడం.. ఆ కుటుంబ కన్నీటిని తమ బాధగా భావించి చేయూతనందించడం వైయస్ఆర్సీపీ నాయకత్వంలో కనిపించే మానవీయతకు నిదర్శనం. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మృతులైన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. కార్యకర్తల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం పార్టీ కోసం పనిచేస్తూ మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు మొత్తం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నిర్ణయించింది. కష్టకాలంలో ఉన్న కుటుంబాలకు తక్షణ ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, వారి సమస్యలను పార్టీ స్థాయిలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు.. కుటుంబ పెద్దను కోల్పోయిన వేళ తమ వెంటే పార్టీ ఉందనే ధైర్యాన్ని కల్పించే మానవీయ చర్య. కార్యకర్తల కష్టాన్ని గుర్తించి, వారి కుటుంబాల బాధ్యతను కూడా తమదిగా భావించే నాయకత్వానికి ఇది ప్రతిబింబం. ‘మేమున్నాం’ అనే నమ్మకమే వైయస్ఆర్సీపీ బలం పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే కార్యకర్తలే వైయస్ఆర్సీపీకి బలం. వారి కుటుంబాల్లో విషాదం చోటుచేసుకున్నప్పుడు పార్టీ అండగా నిలవడం ద్వారా కార్యకర్తలతో తమ బంధం కేవలం రాజకీయ సంబంధం కాదని మరోసారి చాటుతోంది. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు.. గ్రామీణ స్థాయిలోని పార్టీ నాయకులు, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులు వారి కుటుంబాలకు అండగా ఉండేలా చర్యలు చేపట్టడం ద్వారా బాధ్యతాయుతమైన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తోంది. కన్నీటి వేళ అండగా.. కష్టకాలంలో తోడుగా కుటుంబ పెద్దను కోల్పోయిన బాధను ఏ ఆర్థిక సాయం తీర్చలేదు. కానీ ఆ బాధలో తోడుగా నిలిచే నాయకత్వం.. కష్టకాలంలో చేయి అందించే పార్టీ.. ‘మీ కుటుంబానికి మేమున్నాం’ అనే భరోసా ఇచ్చినప్పుడు ఆ కుటుంబానికి కొంత ధైర్యం కలుగుతుంది. ఆపదలో ఉన్న కార్యకర్త కుటుంబాలను ఆదుకోవడం.. మృతుల కుటుంబాలకు ఆర్థిక చేయూతనివ్వడం.. వారి సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకోవడం ద్వారా వైయస్ఆర్సీపీ మానవీయ విలువలకు ప్రాధాన్యతనిచ్చే పార్టీగా నిలుస్తోంది. కార్యకర్త కష్టాన్ని తన కష్టంగా భావించే నాయకత్వం.. కార్యకర్త కుటుంబాన్ని తన కుటుంబంగా చూసే పార్టీ.. ఇదే వైయస్ఆర్సీపీ బంధం. కష్టకాలంలో ‘మేమున్నాం’ అంటూ అండగా నిలిచే ఈ చేయూత కార్యకర్త కుటుంబాలకు కొండంత ధైర్యాన్ని ఇస్తోంది.