భీమిలి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా నూతనంగా నియమితులైన డాక్టర్ బొత్స అనూషను అరకు పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ గుమ్మ తనుజారాణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. తనపై నమ్మకంతో భీమిలి నియోజకవర్గ బాధ్యతలను అప్పగించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి బొత్స అనూష ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకంపై స్పందించి నేరుగా వచ్చి శుభాకాంక్షలు తెలిపిన అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనుజారాణికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. భీమిలి నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని అనూష తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. వైయస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, శ్రేణుల సహకారంతో భీమిలిలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.