కర్నూలులో టీడీపీకి షాక్‌.. 

100 మంది వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక

కర్నూలు: నగరంలో టీడీపీకి చెందిన నాయకులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. టీడీపీ నగర ఉపాధ్యక్షుడు రామయ్య, 100 మందికి పైగా అనుచరులతో కలిసి వైయ‌స్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రామయ్యతో పాటు ఇతరులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ చేరికలతో కర్నూలు నగరంలో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Back to Top