చిత్తూరు జిల్లా: పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలు సందర్భంగా వైయస్ఆర్సీపీ లోక్‌సభా పక్ష నాయకుడు, రాజంపేట ఎంపీ పి.వి. మిథున్‌రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఉదయం సుమారు 10.30 గంటల సమయంలో తొమ్మిది మంది పార్టీ అభ్యర్థులతో కలిసి నామినేషన్లు సమర్పించేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బసవరాజా జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రం పరిసరాల్లో కర్రలు, రాళ్లు, కత్తులతో వందలాది మంది టీడీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. మిథున్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని దాడులు నామినేషన్లు సమర్పించేందుకు వాహనాల్లో వెళ్తున్న మిథున్‌రెడ్డి, వైయస్ఆర్సీపీ అభ్యర్థులపై వరుసగా దాడులు జరిగాయి. మిథున్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు. ఈ ఘటనలో ఎంపీతో పాటు పలువురు వైయస్ఆర్సీపీ నాయకులు గాయపడ్డారు. మిథున్‌రెడ్డి గన్‌మన్ కూడా గాయపడ్డారు. దాడుల మధ్యే ఎంపీ, అభ్యర్థులు నామినేషన్ కేంద్రంలోకి చేరుకున్నారు. కాలేజీలోకి చొరబడి వాహనాల ధ్వంసం మిథున్‌రెడ్డి, అభ్యర్థులు నామినేషన్ కేంద్రానికి చేరుకున్న తర్వాత కూడా దాడులు ఆగలేదు. కాలేజీ గేటును బలవంతంగా తోసుకుని లోపలికి చొరబడిన టీడీపీ కార్యకర్తలు అక్కడ నిలిపి ఉంచిన వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు వాటికి నిప్పంటించారు. వాహనాలను బోల్తా కొట్టించి బీభత్సం సృష్టించారు. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు నామినేషన్ కేంద్రంలో ఎంపీ మిథున్‌రెడ్డి, వైయస్ఆర్సీపీ అభ్యర్థులు ఉండగానే బయట హింసాకాండ కొనసాగిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. దాడులు జరుగుతున్నప్పటికీ పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు భద్రత కల్పించి, స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునే పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వైయస్ఆర్సీపీ వర్గాలు పేర్కొన్నాయి. ------------------- మిథున్‌రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించిన దేవినేని అవినాష్ వైయస్ఆర్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిపై పుంగనూరులో జరిగిన దాడిని ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తీవ్రంగా ఖండించారు. ఎంపీ స్థాయి ప్రజాప్రతినిధిపై, జెడ్ ప్లస్ భద్రత ఉన్న వ్యక్తిపై దాడి జరగడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే టీడీపీ దాడులు: సింహాద్రి రమేష్‌బాబు పుంగనూరులో మిథున్‌రెడ్డిపై కత్తులు, కర్రలు, రాళ్లతో దాడి చేయడాన్ని అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్సీపీ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు ఖండించారు. ఓటమి భయంతోనే చంద్రబాబు టీడీపీ శ్రేణులతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నా అధికారులు ప్రేక్షక పాత్ర పోషించడం దారుణమన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు. ఎంపీకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి?: నారాయణస్వామి మిథున్‌రెడ్డిపై దాడిని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి తీవ్రంగా ఖండించారు. ప్రజాప్రతినిధికే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కేంద్ర బలగాలను మోహరించాలని, దాడికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాణాలకు తెగించి పోరాడుతాం: గుడివాడ అమర్నాథ్ మిథున్‌రెడ్డిపై దాడిని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా ఖండించారు. జెడ్ ప్లస్ భద్రత ఉన్న ఎంపీపై సైతం దాడికి తెగబడటం ఆందోళనకరమని విమర్శించారు. ఎన్ని వ్యవస్థలను ఉపయోగించి అణచివేతకు పాల్పడినా, ప్రజల పక్షాన ప్రాణాలకు తెగించి పోరాటం చేసేందుకు వైయస్ఆర్సీపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో నేడు చీకటి రోజు: విజయానందరెడ్డి పుంగనూరులో మిథున్‌రెడ్డిపై జరిగిన దాడిని విజయానందరెడ్డి ఖండించారు. ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అవసరమైతే జిల్లా వ్యాప్తంగా వైయస్ఆర్సీపీ కార్యకర్తలు పుంగనూరుకు చేరుకుని ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిఘటిస్తారని అన్నారు. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని నామినేషన్ల ప్రక్రియను స్వేచ్ఛగా నిర్వహించాలని, ప్రజలు భయం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.