వైయస్ఆర్ జిల్లా: బద్వేల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీ చైర్మన్ అభ్యర్థిగా రాచపూడి వెంకట సాయికృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ డి.సి. గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ, నియోజకవర్గ యువ నాయకుడు, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యరెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు పలువురు వైయస్ఆర్‌సీపీ నాయకులు హాజరై అభ్యర్థికి మద్దతు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బద్వేల్ మున్సిపాలిటీలో వైయస్ఆర్‌సీపీ తరఫున రాచపూడి వెంకట సాయికృష్ణ పోటీకి సిద్ధమయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో నామినేషన్ దాఖలు కార్యక్రమం నిర్వహించారు.