రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి బాలసుబ్రహ్మణ్యం మృతిపై వైయ‌స్‌ జగన్‌ సంతాపం

  కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ ముఖ్యమంత్రి

తాడేపల్లి : రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి, ఏపీఎస్‌ఆర్టీసీ మాజీ చైర్మన్‌ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐపీఎస్‌ అధికారిగా సుదీర్ఘకాలం పోలీసుశాఖలో సేవలందించడంతో పాటు, ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన బాలసుబ్రహ్మణ్యం మరణం బాధాకరమని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు  వైయ‌స్‌ జగన్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Back to Top