కౌంటింగ్‌ వేళ ఆళ్లగడ్డలో అలజడి.. రెండు కార్లు దగ్ధం

 వైయ‌స్ఆర్‌సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి షరీఫాబీ వాహనాలకు అర్ధరాత్రి నిప్పు.. 

రెండ్రోజుల క్రితం కుమారుడు సాదిక్‌పై కత్తులతో దాడి

నంద్యాల: కౌంటింగ్‌ వేళ ఆళ్లగడ్డలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైయ‌స్ఆర్‌సీపీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి షరీఫాబీకి చెందిన రెండు కార్లను అర్ధరాత్రి దుండగులు తగలబెట్టారు. ఏఎన్‌ఆర్‌ మహబూబ్‌ బాషా ఇంటి ఎదుట నిలిపి ఉంచిన రెండు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

ఈ ఘటనతో ఆళ్లగడ్డలో కలకలం రేగింది. రెండ్రోజుల క్రితమే షరీఫాబీ కుమారుడు సాదిక్‌పై దుండగులు కత్తులతో దాడి చేయగా, తాజాగా ఆమె వాహనాలకు నిప్పు పెట్టడం ఆందోళనకు దారితీసింది. ఎన్నికల కౌంటింగ్‌ సమయంలో వరుస ఘటనలు చోటుచేసుకోవడంపై వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వరుస ఘటనలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు కోరుతున్నాయి.

Back to Top