గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ హయాంలో అరాచకం, అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరాయని, పోలీసులు, ఎన్నికల యంత్రాంగం అధికార పార్టీకి తొత్తులుగా మారి స్థానిక సంస్థల ఎన్నికల్లో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం గుంటూరులోని మాజీ మంత్రి శ్రీ అంబటి రాంబాబు క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, నగర అధ్యక్షురాలు షేక్ నూర్ ఫాతిమాతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా గుంటూరు రూరల్ పరిధిలోని వెంగలాయపాలెం బూత్‌లో పోలింగ్ ప్రక్రియ పూర్తయి సీలు వేసిన బ్యాలెట్ బాక్సును బస్సు నుంచి కిందికి దించి, ఎలాంటి భద్రత లేకుండా వేరే చోటకు తరలించేందుకు ప్రయత్నిస్తున్న పోలింగ్ అధికారి చర్యలను అడ్డుకుని ప్రశ్నించిన వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయ సమన్వయకర్త, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిపై పోలీసులు కక్షపూరితంగా డెకాయిట్ (BSN 310) సహా తీవ్రమైన తప్పుడు సెక్షన్లు మోపి 14 రోజుల రిమాండ్‌కు తరలించడాన్ని వారు ముక్తకంఠంతో ఖండించారు. ఓట్లతో కూడిన బ్యాలెట్ బాక్సును దొంగతనంగా ఎత్తుకెళ్లే అధికారికి రక్షణ కల్పిస్తూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నించిన బాధ్యతాయుత ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయడం రాష్ట్రంలో శాంతిభద్రతల దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ అక్రమ నిర్బంధాలపై న్యాయస్థానాల్లో పోరాడటంతో పాటు త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరేమన్నారంటే.. బ్యాలెట్ బాక్సుల దొంగతనాన్ని అడ్డుకుంటే మాపైనే దోపిడీ కేసులా?: అంబటి రాంబాబు, మాజీ మంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారిపై పూర్తి అన్యాయమైన, అక్రమమైన కేసు బనాయించి 14 రోజుల పాటు రిమాండ్‌కు పంపారు. ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత దుర్మార్గమైన చర్య. గుంటూరు ప్రజలంతా ఈ ఘోరాన్ని ప్రత్యక్షంగా చూశారు. వెంగలాయపాలెం బూత్‌కు సంబంధించి పోలింగ్ ముగిశాక ఏజెంట్ల సంతకాలతో సీలు వేసిన బ్యాలెట్ బాక్సును బస్సులో ఎక్కించి స్ట్రాంగ్ రూమ్‌కు తరలించాల్సింది పోయి, మధ్యలోనే ఆ బాక్సును దించి ఒక అధికారి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కరెన్సీ నోట్ల కంటే విలువైన ఓట్ల బాక్సును సెక్యూరిటీ లేకుండా అధికారి ఎత్తుకెళ్తుంటే దొంగతనం కాక మరేమనుకోవాలి? మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకుని ధర్నా చేశారు. అప్పిరెడ్డి గారు అక్కడికి వెళ్లి ప్రశ్నిస్తే పోలీసులు వచ్చి విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో 10 సెక్షన్లు పెట్టి, రిమాండ్ రిపోర్టు వచ్చేసరికి బెయిల్ రాకుండా ఉండాలనే కుట్రతో దోపిడీ (BSN 310) సెక్షన్‌ను చేర్చారు. ఒక అధికారి బాక్సును ఎత్తుకెళ్తుంటే అతడు దొంగ అవుతాడా లేక అడ్డుకున్న మేము డెకాయిట్లం అవుతామా? ఇంకొకటే తక్కువైంది.. డెడ్‌బాడీ, మహిళ స్టేట్‌మెంట్ దొరికితే మాపై మర్డర్, రేప్ కేసులు కూడా పెట్టేసేవారు. రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తుంటే ప్రజలు ఆయుధాలు ధరించాలా? రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ బ్యాలెట్ బాక్సును దొంగిలిస్తున్న అధికారిని రక్షిస్తూ, అడ్డుకున్న ప్రజాప్రతినిధులను శిక్షిస్తోంది. పోలీసులకు తుపాకులు, లాఠీలు, వాహనాలు ఇచ్చింది అక్రమాలను అడ్డుకోవడానికా లేక అధికార పార్టీ దోపిడీకి కాపలా కాయడానికా? రాష్ట్రంలో రక్షణ కల్పించాల్సిన పోలీసులే ప్రజలను భక్షిస్తుంటే.. ప్రజలు కూడా ప్రైవేట్ సైన్యాలను పెట్టుకోవాలా? ప్రజలే లాఠీలు, ఆయుధాలు పట్టుకుని తమను తాము కాపాడుకోవాల్సిన దీన స్థితిని తీసుకొస్తారా? టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ కనుసన్నల్లోనే ఈ కుట్రలన్నీ సాగుతున్నాయి. అప్పిరెడ్డి గారిపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఆయనకు న్యాయం జరుగుతుండటంతో కక్ష కట్టి ఈ అక్రమ కేసు పెట్టారు. జైళ్లకు వైయస్సార్సీపీ నేతలు భయపడరు; పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాకాని గోవర్ధన్‌రెడ్డి, గతంలో నేను కూడా జైళ్లకు వెళ్లాం. నిర్బంధాలతో మా పోరాటాన్ని ఆపలేరు, మరింత రాటుదేలుతాం. 51.5 శాతం పోలింగ్ ప్రజల నిర్లిప్తతకు నిదర్శనం.. గుంటూరులో పోలింగ్ కేవలం 51.5 శాతమే నమోదైంది. ఎన్నికలు సజావుగా జరగడం లేదని ప్రజలు విరక్తి చెంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఆ పోలైన ఓట్లలోనూ పీవోలు, ఆర్‌వోలు కూటమి వారికి అనుకూలంగా రిగ్గింగ్‌లు చేసుకున్నారు. గోదావరి జిల్లాల్లో సైకిల్ గుర్తుకు వేసిన బ్యాలెట్లను తెచ్చి అధికారులే నేరుగా కలిపేశారు. తప్పుడు పద్ధతుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను చేజిక్కించుకున్నారు. కూటమి ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం, రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC), రిటర్నింగ్ అధికారులు కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. బ్యాలెట్ బాక్సును కూరగాయల తట్టలా నెత్తిన పెట్టుకుని పోలింగ్ ఆఫీసర్ తీసుకెళ్తుంటే పోలీసులు రక్షణ కల్పించడం సిగ్గుచేటు. ముందు ఆ పీవోను సస్పెండ్ చేయాలి. లేళ్ల అప్పిరెడ్డి గారి అరెస్టును ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది తీవ్రంగా ఖండించాలి. లీగల్‌గా పోరాడి ఆయనను త్వరలోనే బయటకు తీసుకొస్తాం. ప్రజాస్వామ్యాన్ని సమాధి చేస్తున్నారు.. సుప్రీంకోర్టులో తేల్చుకుంటాం: మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ ఎంపీ. రాజకీయాలు ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం చేయాలి తప్ప కేవలం ఎన్నికల్లో అక్రమంగా గెలవడం కోసం కాదు. ఎన్నికల కమిషన్ అంటే ప్రజాస్వామ్యాన్ని సమూలంగా పెకిలించే 'ఎరాడికేషన్ కమిషన్'గా మారిపోయింది. ఒక భారత పౌరుడిగా, బాధ్యతాయుత ఎమ్మెల్సీగా అధికారి చేస్తున్న తప్పును నిలదీసి, బ్యాలెట్ బాక్స్‌ను సంరక్షించడానికి ప్రయత్నించిన లేళ్ల అప్పిరెడ్డి గారిపై దొంగతనం, దోపిడీ కేసులు పెట్టడం విడ్డూరం. 50వ వార్డులో మేయర్ కరుణాకర్ రెడ్డి బ్యాలెట్ బాక్సుల విధ్వంసంపై ఫిర్యాదు చేసి రీపోలింగ్ అడిగితే చేతగాని కలెక్టర్, ఎన్నికల యంత్రాంగం సమాధానం చెప్పలేకపోయారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఈ వ్యవహారాలపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేసి రీ-ఎలక్షన్ కోసం పోరాటం చేస్తాం. ఆసుపత్రికి వెళ్తుంటే గేట్లు వేస్తారా? అధికారుల తీరు మారాలి "నిన్న నా ఆరోగ్యం బాగోలేక జనరల్ చెకప్ కోసం జీజీహెచ్ (GGH) ఆసుపత్రికి వెళ్తుంటే పోలీసులు దారుణంగా గేట్లు వేశారు. సామాన్య ప్రజలకు వైద్యం అందించే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులపై ఎలాంటి కేసులు పెట్టాలి? అధికార పార్టీకి ఒక రూలు, ప్రతిపక్షాలకు ఒక రూలా? పోలీసు అధికారులైన సర్వశ్రేష్ట త్రిపాఠి, ఎస్పీ వకుల్ జిందాల్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. రిటైరైన అనిల్ చంద్ర పునేత వంటి అధికారులను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. అధికారులు శాశ్వతం, పాలకులు తాత్కాలికం. పేద ప్రజల పక్షాన నిలిచిన టీఎన్ శేషన్ వంటి నిబద్ధత కలిగిన అధికారులను ఆదర్శంగా తీసుకోవాలి తప్ప అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరించి జీవితాలను నాశనం చేసుకోవద్దు. రేపు వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ తప్పులకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త బూత్‌లలోకి, కౌంటింగ్ కేంద్రాల్లోకి ఏ అధికారంతో వెళ్లారో అధికారులు సమాధానం చెప్పాలి. వైయస్సార్సీపీపై దాడులు జరిగితే పిట్టీ కేసులు.. మాపై అక్రమ బనాయింపులా? : షేక్ నూర్ ఫాతిమా, గుంటూరు నగర వైయస్సార్సీపీ అధ్యక్షురాలు నామినేషన్ల ఘట్టం నుంచి నేటి వరకు పోలీసులు పూర్తిగా టీడీపీ కండువాలు కప్పుకుని ఏకపక్షంగా వ్యవహరించారు. ఎన్నికల వేళ మా నాయకులు, కార్యకర్తలపై కత్తులు, రాడ్లు, కర్రలతో దాడులు చేసినా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. గెలిచిన తర్వాత కూడా ప్రభుత్వ ఉద్యోగి ఒకరు వైయస్సార్సీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడి చేసి, ఒక ఎస్సీ మహిళను కిందపడేసి కొడితే.. ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా చిన్న పిట్టీ కేసు పెట్టి చేతులు దులుపుకున్నారు. అదే టీడీపీ వాళ్లు చేసే అరాచకాలను ప్రశ్నిస్తే మాత్రం మా పార్టీ నేతలపై నాన్‌బెయిలబుల్, డెకాయిట్, ఎస్సీ-ఎస్టీ అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటాం 26వ వార్డులో మహేష్ అనే కార్యకర్తపై జరిగిన దాడితో సహా నగరంలో నిత్యం అరాచకాలు సాగుతున్నాయి. ప్రజల ఓట్లతో సంబంధం లేకుండా, దౌర్జన్యాలతో గెలవాలనుకుంటే ఇక ప్రజాస్వామ్యం, ఎన్నికలు ఎందుకు? చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీ బ్యాలెట్ బాక్సుల అక్రమ తరలింపును ప్రశ్నిస్తే ఆయనను జైలుకు పంపడం హేయమైన చర్య. కూటమి ప్రభుత్వ కక్షసాధింపు రాజకీయాలను, అక్రమ కేసులను చూసి ఎవరూ భయపడరు. న్యాయవ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉంది. అప్పిరెడ్డి గారికి త్వరలోనే బెయిల్ వచ్చేలా లీగల్‌గా పోరాడతాం. కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలనకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.