చిత్తూరు: నగరి డిగ్రీ కళాశాల వద్ద ఇల్లత్తూరు ఎంపీటీసీ ఫలితంపై మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ నాయకురాలు ఆర్కే రోజా నిరసనకు దిగారు. విజయపురం మండలం ఇల్లత్తూరు ఎంపీటీసీ స్థానంలో వైయస్ఆర్‌సీపీ విజయం సాధించినప్పటికీ టీడీపీ గెలిచినట్లు ప్రకటించారని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫలితంపై వైయస్ఆర్‌సీపీ రీకౌంటింగ్ కోరడంతో అధికారులు రీకౌంటింగ్ నిర్వహించినట్లు తెలిపారు. అయితే ఎంపీపీ అభ్యర్థిని కౌంటింగ్ కేంద్రం నుంచి పోలీసులు బయటకు పంపించారని, దీంతో ఫలితాల్లో న్యాయం చేయాలంటూ రోజా, వైయస్ఆర్‌సీపీ శ్రేణులు కౌంటింగ్ కేంద్రం ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. రీకౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి, బ్యాలెట్ ద్వారా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని రోజా కోరారు. ఇల్లత్తూరు ఎంపీటీసీ ఫలితంపై న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని వైయస్ఆర్‌సీపీ శ్రేణులు స్పష్టం చేశారు.