తాడేపల్లి: పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌లో పోస్టల్ బ్యాలెట్ల ద్వారా వెలువడుతున్న ఫలితాల్లో పలు ప్రాంతాల్లో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పులివెందుల, వేంపల్లి, లింగాల, కలశపాడు, తలుపుల, సూళ్లూరుపేట, గూడూరు, విజయనగరం, గజపతినగరం, సీ.బెళగల్, అంబాజీపేట, పద్మనాభం, ఎన్పీకుంట తదితర జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో వైయస్ఆర్‌సీపీ ఆధిక్యం నమోదైంది. పులివెందుల–వేంపల్లి జెడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్‌లో వైయస్ఆర్‌సీపీకి 18, జనసేనకు 7, స్వతంత్ర అభ్యర్థికి 3 ఓట్లు వచ్చాయి. లింగాల జెడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్‌లో వైయస్ఆర్‌సీపీ 21, టీడీపీ 2 ఓట్లు సాధించింది. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల జెడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్‌లో వైయస్ఆర్‌సీపీ 90 ఓట్లతో ముందంజలో ఉంది. అవనిగడ్డ మండలం ఎడ్లలంక ఎంపీటీసీ స్థానాన్ని వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి బందెల రాముడు 11 ఓట్ల మెజార్టీతో గెలుచుకున్నారు. మరోవైపు పెనుకొండ స్ట్రాంగ్ రూమ్ తాళాలు అధికారులు తీసుకురావడం మర్చిపోవడంతో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమైనట్లు సమాచారం. పోస్టల్ బ్యాలెట్లలో కొనసాగుతున్న ఆధిక్యాన్ని వైయస్ఆర్‌సీపీ శ్రేణులు ఉత్సాహంగా స్వాగతిస్తున్నాయి.