ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌తో డీఎస్పీ దురుసు ప్రవర్తన 

 ప్రకాశం జిల్లా: యర్రగొండపాలెం నియోజ‌క‌వ‌ర్గం త్రిపురాంతకం మండలం గణపవరం ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌, డీఎస్పీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కౌంటింగ్‌ కేంద్రంలో త్రిపురాంతకం సీఐ మాతంగి శ్రీనివాస్‌ విధుల్లో ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే.. ఆయనను అక్కడి నుంచి పంపించాలని డీఎస్పీని కోరారు. అయితే దీనిపై డీఎస్పీ “మాకేం చేయాలో తెలుసు.. మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్లండి” అంటూ దురుసుగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ప్రశ్నించాయి. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధితో అధికారులు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అని నిలదీశారు.

ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద అధికారులు సంయమనం పాటిస్తూ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు కోరాయి.

Back to Top