ఆత్మకూరులో అల్లారెడ్డి ఇందుమతి అలుపెరుగని ప్రచారం

 ఇంటింటి ప్రచారంలో చైర్మన్‌ అభ్యర్థికి ప్రజల ఆదరణ

 నెల్లూరు జిల్లా, ఆత్మకూరు:ఆత్మకూరు మున్సిపాలిటీలో వైయ‌స్ఆర్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థి అల్లారెడ్డి ఇందుమతి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థులతో కలిసి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను కలుసుకుంటున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ పార్టీ విధానాలను, ప్రజల సంక్షేమం పట్ల తమ నిబద్ధతను వివరిస్తున్నారు.

ఇందుమతి ఇంటింటి ప్రచారానికి ఆత్మకూరు పట్టణ ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రజలతో మమేకమవుతూ సాగుతున్న ప్రచారంలో స్థానిక సమస్యలను తెలుసుకుంటూ, ప్రజల ఆశీస్సులు కోరుతున్నారు. చైర్మన్‌ అభ్యర్థి అల్లారెడ్డి ఇందుమతితో పాటు వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. 

Back to Top