తిరుపతి ఎస్పీకి వైయ‌స్ఆర్‌సీపీ నేతల ఫిర్యాదు

దాడులు, అడ్డంకులతో నామినేషన్లు వేయలేకపోయిన మేయర్ అభ్యర్థి వాసు యాదవ్ సహా 20 మంది కార్పొరేటర్ అభ్యర్థులు

తిరుపతి: టీడీపీ శ్రేణుల దాడులు, దౌర్జన్యాల కారణంగా నామినేషన్లు దాఖలు చేయలేకపోయామని ఆరోపిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ మేయర్ అభ్యర్థి వాసు యాదవ్‌తో పాటు 20 మంది కార్పొరేటర్ అభ్యర్థులు తిరుపతి ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. వైయ‌స్ఆర్‌సీపీ నేతలు భూమన కరుణాకర్‌రెడ్డి, ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, భూమన అభినయ్‌రెడ్డి అభ్యర్థులతో కలిసి ఎస్పీకి ఫిర్యాదు అందజేశారు.

నామినేషన్లు దాఖలు చేసుకునే హక్కుకు భంగం కలిగించేలా అడ్డంకులు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు సమర్పించేలా భద్రత కల్పించాలని, ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

Back to Top