వైయస్ఆర్ కడప జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న అల్లర్లపై పోలీసులు భారీగా కేసులు నమోదు చేసినట్లు మహానాడు మీడియా కథనం వెల్లడించింది. జిల్లావ్యాప్తంగా సుమారు వెయ్యి మందిపై కేసులు నమోదు కాగా, పులివెందులలో ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డితో పాటు మరో 500 మందిపై కేసులు పెట్టినట్లు పేర్కొంది. పోలీసులపై రాళ్లు రువ్విన వైయస్ఆర్‌సీపీ శ్రేణులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపింది. పులివెందులలో కాల్పులపై సంచలన వివరాలు పులివెందులలో అదనపు ఎస్పీ ఆదేశాలతోనే వైయస్ఆర్‌సీపీ నేతలపై కాల్పులు జరిగినట్లు ఆ కథనం పేర్కొంది. పులివెందుల ఎస్‌డీపీఓ పిస్టల్‌తో 8 రౌండ్లు, సీఐ పురుషోత్తం రాజు పిస్టల్‌తో 10 రౌండ్లు, తొండూరు ఎస్‌ఐ పిస్టల్‌తో 8 రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలిపింది. ఏకే-47తో కానిస్టేబుల్ భాస్కర్ 7 రౌండ్లు, కానిస్టేబుల్ రవికుమార్ నాయక్ 4 రౌండ్లు కాల్పులు జరిపినట్లు పేర్కొంది. అదనపు ఎస్పీ గన్‌మెన్ సీఆర్ రామలింగాచారి కూడా కాల్పులు జరిపినట్లు కథనం వెల్లడించింది. స్టన్ షెల్స్, స్మోక్ షెల్స్ ప్రయోగం పులివెందులలో వజ్ర వాహనం ద్వారా 20 స్టన్ షెల్స్, 40 స్మోక్ షెల్స్ ప్రయోగించినట్లు మహానాడు మీడియా కథనం పేర్కొంది. గ్యాస్ గన్‌తో మరో మూడు స్టన్ షెల్స్ ప్రయోగించినట్లు తెలిపింది. అలాగే వైయస్ఆర్‌సీపీ నేతలపై ఏడు హ్యాండ్ గ్రెనేడ్లు విసిరినట్లు సంచలన వివరాలను వెల్లడించింది.