తిరుపతి: తిరుపతిలో ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించే ఘటన చోటుచేసుకుంది. కార్పొరేటర్గా నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన వైయస్ఆర్సీపీ మహిళా అభ్యర్థి చేతిలో నుంచి నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేయడం దారుణమని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మహిళా అభ్యర్థికి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేకుండా అడ్డుకోవడం ఏ విధమైన ప్రజాస్వామ్యమని ప్రశ్నించాయి. మహిళలకు గౌరవం ఇస్తామని చెప్పే పాలకులు ఇలాంటి ఘటనలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులకు రక్షణ కల్పించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు భూమన అభినయ్రెడ్డి కోరారు.