ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి

పుంగనూరులో నామినేషన్లకు టీడీపీ అడ్డంకులు 

అన్నమయ్య జిల్లా:  పుంగనూరు మున్సిపాలిటీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు నామినేషన్లు వేసేందుకు వెళుతుండగా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డితో కలిసి నామినేషన్లు వేసేందుకు వెళుతున్న వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను టీడీపీ నేతల‌పై ప‌చ్చ‌మూక‌లు దాడికి తెగ‌బ‌డ్డాయి. ఈ క్రమంలో మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లు, క‌ర్ర‌ల‌తో దాడి చేయడంతో పాటు వైయ‌స్ఆర్‌సీపీ వాహనాలను ధ్వంసం చేశారు. ఘటన జరుగుతున్నప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు డిమాండ్‌ చేశారు.

Back to Top