శ్రీ సత్యసాయి జిల్లా: ధర్మవరంలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైయస్ఆర్సీపీ కౌన్సిలర్ అభ్యర్థులు సాయికుమార్, పుష్పమణిపై టీడీపీ, బీజేపీకి చెందిన వ్యక్తులు దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో పుష్పమణికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమైన అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను లాక్కెళ్లారని వైయస్ఆర్సీపీ వర్గాలు ఆరోపించాయి. పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు రక్షణ కల్పించి, స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్సీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.