అనంతపురం: తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి వర్గీయులు బరితెగించారని వైయస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపించాయి. తాడిపత్రి శాస్త్రినగర్లో వైయస్ఆర్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి వేణుగోపాల్ ఇంటి వద్ద జేసీ వర్గీయులు హల్చల్ చేసినట్లు పేర్కొన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో తాడిపత్రిలో రాజకీయంగా కలకలం రేగింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను బెదిరిస్తున్నారనే ఆరోపణలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై తాడిపత్రి పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్సీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.