కడపలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి నామినేషన్‌కు అడ్డంకులు

నామినేషన్ పత్రాలు చించేశారని ఆరోపణ.. ఆర్డీవోకు ఫిర్యాదు

వైయ‌స్ఆర్ జిల్లా:  కడప న‌గ‌రంలోని 30వ డివిజన్ వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి విజయలక్ష్మి నామినేషన్‌ను టీడీపీ జోనల్ ఇన్‌చార్జ్ శ్రీనివాసులురెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీ కార్యకర్తలు హంగామా సృష్టించి, నామినేషన్ పత్రాలను లాక్కొని చింపేశారు. పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై వైయ‌స్ఆర్‌సీపీ నేతలు రవీంద్రనాథ్‌రెడ్డి, అంజాద్ బాషా ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. నామినేషన్ల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని, తమ పార్టీ అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

Back to Top