పుంగనూరులో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లకు అడ్డంకులు

ఎన్నికల అధికారుల తీరుపై ఎంపీ మిథున్‌రెడ్డి ఆగ్రహం

అన్నమయ్య జిల్లా : పుంగనూరు మున్సిపల్‌ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని పార్టీ నాయకులు ఆరోపించారు. కౌన్సిలర్‌ అభ్యర్థులతో పాటు మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి నామినేషన్లను కూడా స్వీకరించేందుకు అధికారులు అంగీకరించడం లేదని విమర్శించారు.

రిటర్నింగ్‌ అధికారి నారాయణరెడ్డి వైఖరిపై రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకోవడం ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతమని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు విమర్శించారు. అభ్యర్థులందరికీ నిబంధనల ప్రకారం నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

Back to Top