మిథున్‌రెడ్డిపై దాడి దుర్మార్గం 

 వైయ‌స్ఆర్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ 

అనంతపురం:  పుంగనూరులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై జరిగిన దాడి దుర్మార్గమని వైయ‌స్ఆర్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.

ప్రజాప్రతినిధులపై దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని రమేష్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను గుర్తించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

రాజకీయ కక్షసాధింపులు, ప్రతిపక్ష నాయకులను భయభ్రాంతులకు గురిచేసే చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని స్పష్టం చేశారు. ప్రజల హక్కులు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం వైయ‌స్ఆర్‌సీపీ నిరంతరం పోరాడుతుందని రమేష్ గౌడ్ పేర్కొన్నారు.
 

Back to Top