గెలిచే సత్తా లేకే నాపై హత్యాయత్నం

దాడులు, బెదిరింపులతో ఎన్నికలు జరిపితే సహించబోం

నామినేషన్ల మొదటిరోజే హింసాత్మక ఘటనలు ప్రజాస్వామ్యానికిి మచ్చ

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ధ్వజం

ఇతర రాష్ట్రాల నుంచి రౌడీ గ్యాంగ్లు , గూండా ముఠాలతో దాడులు

చంద్రబాబు, లోకేశ్ కుట్రలో భాగమే హింసాత్మక ఘటనలు

ఎంపీ మిధున్ రెడ్డి  ఆగ్రహం

కూటమి ప్రభుత్వానికి స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధం

అదికారులు చట్ట పరిధిలోనే పని చేయాలి.. లేకుంటే పర్యవసానాలు తప్పవు

మాజీ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి వార్నింగ్

వైయ‌స్ఆర్‌సీపీ నామినేషన్లు స్వీకరించకపోవడం ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు

ఎన్నికలు సంఘం స్పందించి చర్యలు తీసుకోవాలి

పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి డిమాండ్

ఎంపీ మిధున్ రెడ్డిపై హత్యాయత్నం పై రాజ్యాంగబద్ద సంస్థలను ఆశ్రయిస్తాం

రాష్ట్ర ప్రభుత్వంపై కేసు నమోదు చేసి విచారణ జరపాలి

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ స్పష్టీకరణ

చిత్తూరు: ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచే సత్తా లేక కూటమి నాయకులు తనపై హత్యాయత్యానికి దిగారని వైఎస్సార్ సీపీ పార్లమెంట్ సభ్యులు  మిథున్ రెడ్డి మండిపడ్డారు.  దాడులు, బెదిరింపులు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఎన్నికలు జరిపాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. స్థానిక  సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను అడ్డుకోవడమే లక్ష్యంగా గత మూడు, నాలుగు రోజులుగా బయట ప్రాంతాల నుంచి రౌడీలు, గూండాల ముఠాలను  తీసుకొచ్చి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానికంగా  ఆయన మీడియాతో మాట్లాడుతూ,  కున్నూరులో చోటుచేసుకున్న పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చగా నిలుస్తున్నాయని వ్యాఖ్యానించారు.  నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లిన తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో దాడులు చేశారని మిథున్‌రెడ్డి తెలిపారు. చైర్మన్ అభ్యర్థిని నామినేషన్ వేయించేందుకు తీసుకెళ్తున్న సమయంలో తనపై హత్యాయత్నం చేశారని వెల్లడించారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారని, పలు వాహనాలను ధ్వంసం చేశారని  పేర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలవనీయకుండా భయపెట్టే ప్రయత్నాలు సాగనివ్వబోమని ఇకపై హెచ్చరించారు.

ఇతర రాష్ట్రాల నుంచి రౌడీ గ్యాంగ్ లు, గూండా ముఠాలు.. చంద్రబాబు, లోకేశ్ కుట్రే..

కున్నూరు ప్రాంతంలో సాధారణంగా ప్రశాంత వాతావరణం ఉంటుంది. అయితే స్థానిక ఎన్నికల్లోఎలాగైనా  గెలవాలనే ఉద్దేశంతో బయట ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వ్యక్తులను సమీకరించి గొడవలు సృష్టిస్తున్నారు. సుమారు 50 మంది వరకు బయట రాష్ట్రాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చి దాడులకు పాల్పడ్డారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ల ప్రోద్బలంతోనే బయట ప్రాంతాల నుంచి వ్యక్తులను సమీకరించి దాడులకు ప్రణాళిక రచించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటే ప్రజల తీర్పును గౌరవించడం, ప్రత్యర్థులతో రాజకీయంగా పోటీ పడడం. దాడులు చేసి భయపెట్టడం కాదు.  నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లినప్పటికీ రిటర్నింగ్ అధికారి వాటిని స్వీకరించలేని పరిస్థితి ఏర్పడింది.  తమపై పైస్థాయి నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఉన్నాయని, నామినేషన్లు స్వీకరించలేమని ఆర్‌ఓ చెప్పారు. నామినేషన్లు తీసుకోవడంతోపాటు కనీసం స్వీకరణకు సంబంధించిన రసీదు లేదా ధ్రువీకరణ పత్రాలు కూడా ఇవ్వడం లేదు.  దాదాపు మూడు గంటలపాటు అక్కడే వేచి ఉన్నప్పటికీ ఆరు నామినేషన్లను కూడా స్వీకరించని పరిస్థితి నెలకొంది.  ఎన్నికల ప్రక్రియలో రిటర్నింగ్ అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సి ఉండగా, రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నామినేషన్లు దాఖలు చేసే ప్రాథమిక హక్కును కూడా అడ్డుకుంటే ఎన్నికలు నిర్వహించడంలో అర్థం ఏముంటుంది..?  ప్రజల మద్దతు ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి. దానికి బదులుగా ప్రత్యర్థుల నామినేషన్లను అడ్డుకోవడం, పత్రాలు లాక్కోవడం, దాడులు చేయించడం వంటి చర్యలకు పాల్పడటం సరికాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులపై ఉంది.  నామినేషన్ల  దాఖలు విషయంలో తదుపరి చర్యలు ఎలా తీసుకోవాలనే అంశంపై పార్టీ పెద్దలు, ఇతర నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలపై పార్టీ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతాం.    ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. ప్రజల తీర్పును గౌరవించకుండా దాడులు, బెదిరింపులతో ఎన్నికల్లో ఆధిపత్యం చెలాయించాలని చూడటం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని చంద్రబాబు, లోకేశ్ గుర్తు పెట్టుకోవాలి. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు బెదిరింపులకు వెనుకాడకుండా ప్రజాస్వామ్యబద్ధంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తారు.

మా ప్రభుత్వం వచ్చాక పర్యవసానాలు చవిచూడక తప్పదు.. చట్టపరిధిలో అధికారులు పని చేయాలి
కూటమి ప్రభుత్వానికి స్థానికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరిక

రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతూ స్థానికి ఎన్నికలు నిర్వహించాలనుకుంటే కూటమి ప్రభుత్వానికిి ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజాస్వామ్య విలువలకు పాతర వేసేలా పాలన సాగిస్తున్న చంద్రబాబుకు దాసోహమై సహకరిస్తే అధికారులు తగిన వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత తగిన పర్యవసానాలను చవిచూడక తప్పదు. ఏ ప్రభుత్వం కూడా శాస్వతం కాదని, అధికారులు తమ చట్ట పరిధిలో పని చేయాలని గుర్తు పెట్టుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను అవహేళన చేస్తోంది. ప్రజలు స్వేచ్ఛగా తమ ప్రతినిధులను ఎన్నుకునే అవకాశాన్ని కల్పించాల్సిన ప్రభుత్వం, అధికార యంత్రాంగాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించు కుంటోంది. నామినేషన్లు స్వీకరించకుండా అడ్డుకోవడం ద్వారా ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు తలెత్తుతున్నాయి,  ఈ ఘటనపై ఎన్నికల సంఘం స్పందించి, వాస్తవాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలి. ఎంపీ మిథున్ రెడ్డితో పాటుగా, వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులపై దాడులు ఓడిపాతామనే భయంతో చంద్రాబు, లోకేశ్ సాగిస్తున్న ఆటవీక క్రీడ ఇది. మిథున్ రెడ్డిపై దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉంది.

ఎంపీ మిథున్ రెడ్డిపై హత్యాయత్నం, వైఎస్సార్ సీపీ నేతలపై దాడలు ప్రభుత్వ గూండాగిరీకి నిదర్శనం
కూటమి ప్రభుత్వంపై కేసు నమోదు చేసి విచారణ జరపాలి 
: రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ డిమాండ్

తాడేపల్లి:  రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే కూటమి నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులపై హత్యాయత్నాలకు తెగబడటం,  దాడులు జరుగుతుండటం ప్రజాస్వామ్యానికిి ప్రమాదకరమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు.  అభ్యర్థుల నామినేషన్ పత్రాలను లాక్కోవడం, చించేయడం, వాహనాలకు నిప్పంటించడం, పార్టీ కార్యాలయాలపై దాడులకు పాల్పడటం వంటి ఘటనలు చంద్రబాబు నాయుడు కుట్రులకు పరాకాష్టగా అభివర్ణించారు. తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీకేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్ సభ్యునిగా ఉన్న మిథున్ రెడ్డి పార్టీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేసేందుకు వస్తే ఆయనపై  హత్యాయత్నానికి పాల్పడటం చంద్రబాబు ప్రభుత్వ గూండాగిరీ నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఎంపీ మిధున్ రెడ్డిపై జరిగిన దాడిపై తక్షణమే ప్రభుత్వం విచారణ జరిపించాలని జూపూడి ప్రభాకర్ డిమాండ్ చేసారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమమి భయంతో వైయ‌స్ఆర్‌సీపీ పట్ల ప్రజలు చూపుతున్న ఆదరణను ఓర్వలేక నేతలు దాడులకు పాల్పడుతున్నారని జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులను భయపెట్టి, ఏకగ్రీవాల పేరుతో ప్రజాస్వామ్య ప్రక్రియను  అపహస్యం చేయడం సరికాదని హితవుపలికారు. ఎన్నికల నిర్వహణలో పోలీసులు, రెవెన్యూ అధికారులు, ఎన్నికల సిబ్బంది తమ బాధ్యతలను నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని కోరారు. దాడులకు పాల్పడిన టీడీపీ గూండాలపై  కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోకపోతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని  హెచ్చరించారు. కూటమి ప్రభుత్వ దౌర్జన్యాలు, దాడులు, బెదిరింపులపై డీజీపీ, ఎన్నికల సంఘం, హైకోర్టు, సుప్రీంకోర్టు సహా సంబంధిత రాజ్యాంగ సంస్థలను ఆశ్రయిస్తామని జూపూడి ప్రభాకర్ స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని. ఎన్నికల ప్రక్రియలో హింస, బెదిరింపులు కొనసాగితే ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే హక్కును కోల్పోతారని జూపూడి ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైన చోట్ల రీపోలింగ్ నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని, ఎన్నికల అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులను తక్షణమే విచారించాలని కోరారు. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు జరిగేలా ఎన్నికల సంఘం తక్షణ చర్యలు తీసుకోవాలని, అధికార పార్టీ నేతలు ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని జూపూడి ప్రభాకర్ సూచించారు.

Back to Top