మిథున్‌రెడ్డిపై దాడి.. చంద్రబాబు ఓటమి భయానికి నిదర్శనం 

 వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను భయపెట్టే కుట్రలు మానుకోవాలి 

 వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ద్రాక్షాయణి 

పుంగనూరు: రాజంపేట ఎంపీ, పార్లమెంట్‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఫ్లోర్‌ లీడర్‌ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై జరిగిన దాడి ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ద్రాక్షాయణి తీవ్రంగా ఖండించారు. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తున్న అభ్యర్థులకు మద్దతుగా వెళ్లిన ఎంపీపై దాడికి యత్నించడం హేయమైన చర్యగా అభివర్ణించారు.

పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరగడం అధికార దుర్వినియోగానికి నిదర్శనమని ద్రాక్షాయణి విమర్శించారు. ఎంపీ స్థాయి ప్రజాప్రతినిధికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల బరిలో నుంచి తప్పించాలనే ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేశారు.

దాడులు, బెదిరింపులకు వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు భయపడరని, ధైర్యంగా నామినేషన్లు దాఖలు చేసి ఎన్నికల్లో పోటీ చేస్తారని ద్రాక్షాయణి స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని పొందడం ద్వారా ఎన్నికల్లో గెలవాలి తప్ప, కుట్రలు, దౌర్జన్యాలతో గెలవాలని చూడటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు

Back to Top